Followers

గ్యాస్ వినియోగదారులను మోసగిస్తే చర్యలు


 


 గ్యాస్ వినియోగదారులను మోసగిస్తే చర్యలు

--- ఆర్డిఓ సీతారామారావు

 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

గ్యాస్ వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరత చూపించి మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ డివిజన్ అధికారి సీతారామారావు హెచ్చరించారు. గ్యాస్ సమస్యలపై పలు ఫిర్యాదులు వచ్చిన ఈ నేపథ్యంలో ఏజెన్సీలను గురువారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడే ఉన్న గ్యాస్ వినియోగదారులు తో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏజెన్సీల నిర్వాహకులు తో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరతను చూపించిన అలసత్వాన్ని ప్రదర్శించిన నిర్దేశించిన కన్నా ఎక్కువ రుసుము వసూలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ నమోదులు కూడా పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సరఫర చేయాలన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...