Followers

ఆర్ధిక పరిపుష్టిని కల్పించడమే నిజమైన మహిళా సాధికరత


 


ఆర్ధిక పరిపుష్టిని కల్పించడమే నిజమైన మహిళా సాధికరత


మహిళల ఖాతాల్లో జమ అయిన రూ. 34.84 కోట్ల సున్నా వడ్డీ రుణాలు


కరోనా కష్టం లో ఆర్ధిక సాయం పట్ల మహిళల ఆనందం


                                              ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి


విజయనగరం, పెన్ పవర్ 


:  మహిళలకు ఆర్ధిక పరిపుష్టిని కల్పించడమే నిజమైన మహిళా సాధికరతగా భావిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు బ్యాంకుల రుణ భారాన్ని తగ్గించి వడ్డీ లేని రుణాలను  అందించి మహిళా పక్షపాతిగా మరో సారి రుజువు చేసుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి అన్నారు.  శుక్రవారం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి     శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకాన్ని రాజధాని నుండి ప్రారంభించారు.    రాష్ట్ర ముఖ్యమంత్రి సున్నా వడ్డీ పధకాన్ని ప్రారంబించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి గారు పాద యాత్ర లో నేనున్నాను , నేను విన్నాను అని చెప్పేరని,   మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ ఆ మాట నిలుపుకుంటూన్నారని, యావత్ మహిళా లోకం నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు.  


          రాష్ట్రం ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ  మహిళా స్వయం సహాయ సంఘాలకు 1400  కోట్ల రూపాయలను సున్నా వడ్డీ క్రింద అందించడం  ఆనందంగా ఉందన్నారు.  కరోనా నేపథ్యం లో  మాస్కులను తయారు చేసే అవకాశాన్ని మహిళలకు  కల్పించి వారికీ ఉపాధి ని కూడా కలిగేల చూసారని తెలిపారు.  కరోనా లో రెండు విడతల్లో రేషన్ సరుకులను ఉచితంగా అందించడమే కాక, వాలంటీర్ ల ద్వారా  వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఇంటికే పంపించారని తెలిపారు.   మద్య నిషేదాన్ని అమలు చేస్తూ, బెల్ట్ షాప్ లను లేకుండా చేసారని, అంతే కాకుండా  మహిళల రక్షణకు దిశా చట్టాన్ని, ప్రత్యెక మహిళా పోలీస్ లను సచివాలయాల్లో నియమించి,  మహిళలకు ఆర్ధిక, సామజిక రక్షణ కల్పిస్తున్నారని అన్నారు.


          జిల్లాలో 44 వేల  గ్రూపులకు 5 లక్షల 9 వేల మంది లబ్ది దారులకు 34.84 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందించడం జరిగిందని  తెలిపారు.  ఇందులో డి. ఆర్. డి.ఎ ద్వార 23 కోట్ల 29 లక్షలు కాగా మెప్మా సంఘాలకు 11 కోట్ల 55 లక్షల 10 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.


          ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ , డి. ఆర్ . డి ఎ  పి. డి. కె. సుబ్బా రావు, మెప్మా పి . డి  కే. సుగుణాకర రావు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


 


 


 ముఖ్యమంత్రి గారి సందేశం : 


 శుక్రవారం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకాన్ని రాజధాని నుండి ప్రారంభించారు.   ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడారు.  మహిళలను  ఆర్ధికంగా బలోపేతం చేసి,  వారికీ సమాజం లో  గౌరవాన్ని పొందేలా ప్రభుత్వ  పథకాలను  అమలు చేయడం జరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.   2009 లో డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పావలా  వడ్డీ రుణాలను ప్రారంభించారని, 2016 లో అధికారం లోనికి వచ్చిన ప్రభుత్వం ఈ పధకాన్ని అపివేశారని తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రం లో కరోనామూలంగా  రాష్ట్రం ఆర్ధిక సమస్యలలో ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లోనే అక్క చెల్లెళ్ళకు ఆర్ధిక అండనందిస్తే ఆనందంగా ఉంటారని భావించి  ఈ సున్నా వడ్డీ పధకాన్ని తీసుకువచ్చామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల  మంది మహిళలకు 1400 కోట్ల రూపాయలను ఒక్క బటన్ నొక్కి  వారి ఖాతాల్లో జమ చేసారు.   ఈ పధకం ద్వారా ఒక్కో గ్రూప్ నాకు 20 వేల నుండి 40 వేల రూపాయల వరకు లబ్ది చేకూరనుందని అన్నారు.  మహిళల పేరున నగదు వేస్తే అది సద్వినియోగం అయి, ఆ కుటుంభానికి మేలు జరుగుతుందని  అందుకే అమ్మవడి,  వసతి దీవెన పధకాల ద్వారా బిడ్డల చదువు కోసం తల్లుల ఖాతాలో  జమ చేయడం జరిగిందన్నారు.  మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చేలా చట్టం తీసుకువచ్చామన్నారు. మహిళలకు రక్షణ కల్పించేలా దిశ చట్టాన్ని తెచ్చి, 13 జిల్లాల్లో దిశా పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేశామన్నారు.  ప్రతి సచివాలయం లో  ఒక మహిళా  పోలీస్ ను నియమించామని, ప్రతి గ్రామ పంచాయతి లో మహిళా మిత్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు


ఈ నెల 28 న ఫీజు  రియంబర్స్మెంట్:


   రాష్ట్ర చరిత్ర లోనే మొట్ట మొదటి సారిగా   ఫీజు  రియంబర్స్మెంట్ క్రింద బకాయిలన్నిటిని చెల్లించడం జరుగుతుందని అన్నారు.    గత బకాయిలు 1880 కోట్ల తో పాటు 2019-20 సంవత్సరం కు 2 వేల కోట్ల రూపాయలను  మొత్తం సుమారు 4 వేల కోట్ల ను చెల్లించనున్నట్లు వెల్లడించారు.  మార్చ్ 30 వరకు ఉన్న బకాయిలన్ని చెల్లిస్తామని, వచ్చే జూన్ లో చెల్లించే ఫీజు  నేరుగా  తల్లుల ఖాతల్లోనే జమ చేస్తామని తెలిపారు.   పిల్లల చదువు తీరును, ల్యాబ్ లను, వసతులను తనిఖీ చేసాక తల్లులు ఫీజు కట్టెలా  ఏర్పాటు చేశామన్నారు.


జూలై 8 న ఇళ్ళ పట్టాల పంపిణి:   స్వర్గీయ వై.ఎస్.  రాజ శేఖర రెడ్డి  గారి జన్మదినాన్ని పురష్కరించుకొని ఇళ్ళ పట్టాలను జూలై 8వ తేదీన పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు . కరోనా వచ్చి ఉండక పోతే ఇప్పటికే మహిళలందరూ ఇళ్ళ పట్టాలను పొంది ఉండేవారని,  జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది మహిళలకు పట్టాలను అందజేస్తామని తెలిపారు.   


          ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల నుండి మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మహిళల కోసం అమలు చేస్తున్న పధకాల పై హర్షం వ్యక్తం చేసారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...