కోటిరూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చి సామజిక బాధ్యతను చాటుకున్న "మెప్మా" స్వయం సహాయక సంఘ మహిళలు
కరోనా మహాహమ్మారిపై పోరాటంలో వీరు సైతం.
ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించిన మెప్మా స్వయం సహాయక సంఘ మహిళలు.
ఒకపక్క మాస్కులు, శానిటైజెర్లు మరియు పీపీఈ సెట్లు తయారు చేస్తూ కరోనా నివారణ సేవకులకు తోడ్పాటు అందిస్తునే మరో పక్క వార్డ్ స్థాయిలో రాపిడ్ సర్వేలో, కూరగాయలు మరియు పండ్లు ప్రజలకు అందుబాటులో ఉంచుటలో భాగస్వామ్యులవుతున్నారు స్వయం సహాయక సంఘ మహిళలు.
గంట్యాడ అప్పలరాజు ఎడిషన్ ఇంచార్జ్ విశాఖపట్నం, పెన్ పవర్ :
కరోన మహమ్మారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అలుపెరుగని పోరాటం మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రణాళికాబద్ధమైన నివారణ చర్యలలో తోడ్పాటు అందించడంలో మేము సైతం అంటూ మెప్మా ఆధ్వర్యంలో ఉన్న ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రతి సభ్యురాలు తమవంతు సహాయంగా కొంత చొప్పున మొత్తం వెరసి కోటి రూపాయలను కరోనా నిరోధక చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి పట్టణ స్వయం సహాయక సంఘ సభ్యులంతా కలిసి విరాళంగా అందించాయి. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్రీ జె.శ్యామలారావు మార్గదర్శకత్వంలో మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జి.ఎస్ నవీన్ కుమార్, ఐఏఎస్, మరియు స్వయం సహాయక సంఘ ప్రతినిధుల బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ కోటి రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఈ సందర్బంగా మిషన్ సంచాలకులు నవీన్ కుమార్, ఐఏఎస్ మెప్మా ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలలో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా 10000 పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్ (PPE) సెట్లు, 18, 55,949 మాస్క్లు మరియు 59,739 లీటర్ల శానిటైజెర్లను తయారుచేసి ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు, 10,775 నిరాశ్రయులకు అన్ని వసతులతో కూడిన 222 శాశ్వత మరియు తాత్కాలిక షెల్టర్ల ద్వారా కల్పిస్తున్న ఆశ్రయం, అలాగే వార్డ్ స్థాయిలో నిర్వహిస్తున్న ఇంటి ఇంటి సర్వే బృందంలో రిసోర్స్ పర్సన్ల పనితీరును, లాక్డౌన్ నేపథ్యంలో ఇంటివద్దకే ప్రజలకు కూరగాయలు, పండ్లను స్వయం సహాయక సంఘాల ద్వారా అందుబాటులో ఉంచుతున్న విధానం, క్షేత్ర స్థాయి ఉన్న పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటు ప్రతి ఒక్కరికి కోవిడ్19 నివారణ కోసం పాటించవలసిన నియమాల గురించి అవగాహన కల్పించేలా యూనిసిఫ్ సమన్వయం తో జూమ్ టెక్నాలజీ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ శిక్షణల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే భవిష్యత్తులో మెప్మా ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలైన పట్టణ మహిళలందరికీ శానిటరీ పాడ్స్ ఇవ్వటం కోరకు హ్యాపీడేస్ శానిటరీ పాడ్స్ తయారీ యూనిట్ ను ఎస్.హెచ్.జి. ఎంట్రీప్రెన్యూర్ల ద్వారా స్థాపించడం, పులివెందులలో పులి చాకెలేట్స్ ను ఎస్.హెచ్.జి. ఎంట్రీప్రెన్యూర్ల ద్వారా తయారు చేయించడం, లక్ష మంది నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించేలా వైస్సార్ ఉపాధి పధకం, ఎస్.హెచ్.జి. ఎంట్రీప్రెన్యూర్ల ద్వారా ఉత్పత్తి అవుచున్న ఉత్పత్తులన్నింటినీ ఒకేచోట మారాయి ఆన్లైన్ లో అమ్ముటకు "ఆసమ్ మాల్" ను ఏర్పాటుచేయబడుతుందని అలాగే "దిశ - టాక్సీ" ద్వారా ఈ-ఆటో రిక్షాలను మహిళలకు ఇచ్చి పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించి మహిళలకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించామని తెలియచేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం సహాయక సంఘ మహిళల స్ఫూర్తిని మరియు కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో వారి అందిస్తున్న తోడ్పాటును, వారు చేస్తున్న సేవలను, మెప్మా అమలుచేస్తున్న కార్యక్రమాలను అభినందించి వీరిని ఆదర్శంగా తీస్కొని మరింత మందిలో సామజిక స్ఫూర్తి కలగాలని ఆశిస్తున్నానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ శ్రీమతి. శివపార్వతి మరియు రాష్ట్రస్థాయి సిబ్బంది పాల్గొనడం జరిగింది.
No comments:
Post a Comment