జనసేన ఆధ్వర్యంలో కారోనా వైరస్ నియంత్రణ కొరకు హైడ్రోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేశారు
పెన్ పవర్, గోపాలపురం : రాము
కరొనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్లో ఉన్న గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు జనసేన సైనికులు పిలుపునిచ్చారు. మండలంలోని దొండపూడి గ్రామం లో జనసైనికులు సుమారు 15 మంది తమ గ్రామాన్ని శుభ్రం చేసుకోవడం కొరకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఫ్యాక్టరీ యాజమాన్యం సరఫరా చేసిన సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావకాన్ని గ్రామంలోని అన్ని వీధులలో స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా గా అధ్యక్షులు పోతిరెడ్డి వీరస్వామి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గ్రామాలలో సంపూర్ణ పారిశుధ్యం నెలకొల్పేందుకు జనసైనికులు పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో పోలినాటి రాజేంద్ర, కడియం శ్రీనివాస్, వంగ బ్రదర్స్, చింతా రావు, బద్రి, ,యాకోబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment