Followers

కోళ్లు పంచిన టీడీపీ నేత


కోళ్లు పంచిన టీడీపీ నేత


విజయనగరం, పెన్ పవర్


మండల టీడీపీ అధ్యక్షుడు బొద్దల నరసింగ రావు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ లో ఉన్న తమ గ్రామ ప్రజలకు కోళ్లు, కూరగాయలు వినూత్నంగా పంపిణీ చేశారు. మంగళ వారం ద్వారపూడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసింగ రావు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ వల్ల తన గ్రామ ప్రజలు పట్టణ ప్రాంతానికి దూరంగా ఉండడం వల్ల, కూరగాయలు, చికెన్ వంటి వాటికి దూరమయ్యారని తెలిపారు. అయితే తమ గ్రామ ప్రజల కనీస అవసరాన్ని గుర్తించి ఇంటికో కోడి చొప్పున 1200 కోళ్లు, ఇంటికి ఆరు చొప్పున 6 వేల కోడి గుడ్లు , నాలుగు రకాల కూరగాయలు పంపినీ చేశామన్నారు. అదేవిధంగా గ్రామంలో ఇప్పటికి తన సొంత ఖర్చులతో రెండు సార్లు శానిటేషన్ కార్యక్రమం నిర్వహించి రసాయనాలు స్ప్రే చేయించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు నందుకొని మండలంలోని ప్రతి గ్రామానికి ఆది వారం రాత్రి కొవ్వొత్తులు పంచి పెట్టి వెలిగించినట్టు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయిస్తూ, స్ప్రే చేయించామన్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఈ కష్ట కాలంలో వారికి అవసరమైన, తమకి తోచిన సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో ని యువకులంతా తమ సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కోడి, కూరగాయలు, గుడ్లు ప్రజలకి అంద చేశారు. ఈ కార్యక్రమంలో బొద్దల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...