Followers

ప్రకటన విడుధల చేసిన ముస్లిం మైనారిటీనాయకులు


విజయనగరం, పెన్ పవర్ 


ఢిల్లీలోని నిజాముద్దీన్ప్రాంతానికి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి ,వారిలో ఇద్దరిని కేంద్ర ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఒక వ్యక్తి హైదరాబాదులో వైద్యులు తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరెంట్ టైం లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఇంకా ఎవరైనా ముస్లిం సోదరులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉంటే వెంటనే దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకొని ఉండవలసిన అవసరం ఉంది .మీరు వైద్య పరీక్షలు చేయించుకొని మీరు ఎవరెవరితో కలిశారో ఆ వివరాలు పోలీసువారికి గాని ,వైద్యులు కానీతెలియపరిచిన వారు మీకు తగిన వైద్య సలహాలు కూడా ఇస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా లక్షణాలు బయటపడటానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చుఅలా అని మాకు ఏమీ లేదుఅని అశ్రద్ధ చేయకుండా కరెంట్ టైం లో ఉంటూ ఎటువంటి సూచనలు బయటపడినవెంటనే పరీక్షలు చేయించుకోవలసిన దిగా రెండు చేతులు జోడించి ముస్లిం సోదరులకు మనవి చేస్తున్నాను. మీరు అనవసర భయాలు పోయి చెప్పకుండా ఉన్నట్లయితేవ్యాధి సోకితే మీ దేహాన్ని చూడటానికి మీ తండ్రి కానితండ్రి గానిబిడ్డ గాని ,స్నేహితులే కానీఎవరు రాలేని పరిస్థితి .చివరకు నీ కర్మకాండ ఎలా జరుగుతుందో తెలియదు .ఇంత నికృష్టపు చావు మనకు అవసరమాఈ సమాజం కోసందేశం కోసంప్రజలను  రక్షించడానికి కోసం 24 గంటలు శ్రమిస్తున్నటువంటి వైద్యులకుఎండనకావాననకాతమ కుటుంబాన్ని వదిలి మన కోసం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థకురెండు చేతులెత్తి నమస్కరిస్తూవారికి సహకరిద్దాం రండి. దయచేసి మీ వద్ద ఏదైనా సమాచారం ఉన్న ఎడల ఈ క్రింది  టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి సమాచారం అందించవలసినదిగా మనవి. నిజాముద్దీన్ మత  ప్రార్థనలకు హాజరైన వారి కొందరు వివరాలను నిజాముద్దీన్ ప్రార్థనకు హాజరు వచ్చిన వారి వివరాలు  వక్ఫ్ బోర్డు ద్వారా సేకరించి వారు విడుదల చేసినటువంటి  వివరాలను జిల్లా మైనారిటీ అధికారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి అందించడం జరిగిందని తెలిపారు.


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...