పంచాయతీ సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ...
గోకవరం పెన్ పవర్
తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, గుమ్మల్ల దొడ్డి పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు పంచాయతీ సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నాగులపాటి రామ నారాయణ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలను నిత్యం పరిష్కరిస్తున్న సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే నిత్యావసరాలను సమకుర్చినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్థిక సహాయంతో ఈ నిత్యావసరాలు సమకూర్చడం జరిగింది అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పంచాయతీ సిబ్బంది కి అందజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఈదీ రత్న జ్యోతి అశోక్ , కోట సూరిబాబు, యోగి సత్తిబాబు శరణం సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment