జీడి మామిడి పై ఆదారపడిన రైతులను ఆదుకోవాలి
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) : మజ్జి శ్రీనివాస మూర్తి
జిల్లా లో జీడీ మామిడి తోటలపై ఆదారపడి జీవిస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రెల్లి రైతులు జీడి మామిడి తోటల పై భారీగా పెట్టుబడులు పెట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యాపారం కుంటు పడింది వారు తీవ్రంగా నష్ట పోయరని అన్నారు. ఈ సీజన్‌లో జీడి మామిడి ని మార్కెట్ ధర నిర్ణయించి ప్రభుత్వమే ఐకెపికి అప్పగించి కొనుగోలు చేయాలని ఆయన కోరుతున్నారు. డ్వాక్రా మహిళలు ద్వారా మార్కెట్ ధరకె విక్రయించేటట్లు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని అలాగే జీడీ మామిడి కి రవాణా సౌకర్యo కల్పించాలని కోరుతున్నారు. రెల్లి జీడీ మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఆదుకోవాలని పాపారావు కోరుతున్నారు.
No comments:
Post a Comment