విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, పెన్ పవర్ : రాము
తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్. లాక్ డౌన్ లో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులతో పాటుగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వారు జర్నలిస్టులు. ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించి ఇస్తున్న వారికి ఇచ్చేది దానం కాదు గౌరవమే. జీతాలు లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు వారిని వినియోగించుకునే రాజకీయనాయకులే వారికి జీతాలు ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, పుల్లా బాబి, తోట శేషు, మారిశెట్టి పోతురాజు తదితర జన సేన నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment