కరోనా నిర్బంధం వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శిరిపురపు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి చేయూతగా అందించారు
పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్
పరవాడ మండలం:పరవాడ గ్రామ ప్రజలు త్రాగునీరు సమస్యతో ఇబ్బంది పడుతుంటే భగీరథుడు లా వారికి గత 16 రోజులుగా ట్యాకర్ తో త్రాగు నీరు అందిస్తూనే స్వీయ నిర్బంధం పొడిగింపు కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు నిత్యావసర సరుకులను అందిoచి అన్నదాతగా వారికి అండగా నిలిచిన శిరిపురపు అప్పలనాయుడు. సోమవారం నాడు శిరిపురపు అప్పలనాయుడు తన వ్యక్తిగత నిధులతో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యమానికి రాష్ట సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,వెంకట పద్మ లక్ష్మీ దంపతులు ముఖ్య అతిదులు గా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.మండల రాజకీయాల్లో శిరిపురపు కి అనుకున్న పదవులు దక్కి రాజకీయంగా అనుకున్న ఎత్తుకు ఎదగక పోయినా ప్రజల కష్టాలను చూసి వారికి చేయూత ఇచ్చి సేవచేయడంలో తనదైన స్టయిల్లో అందరికి అన్నా ఎత్తుకు ఎదుగుతున్నారు.గ్రామంలో లోని 1600 వదల కుటుంబాలకు బియ్యము,కందిపప్పు,గోధుమపిండి,గోధుమ రవ్వ,పంచదార లను అందించారు.శిరిపురపు సామాజిక బాధ్యతతో చేస్తున్న సేవలను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట వైసిపి విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,స్కూల్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పయిల హరీష్,వర్రి లక్ష్మీ, బండారు రామారావు,చీపురుపల్లి రామారావు,పయిల వెంకటరావు,గండి గోవింద్,చీపురుపల్లి సన్యాసిరావు,పయిల నరేష్,శిరిపురపు రాజేష్,శిరిపురపు అయ్యబాబు,చుక్క అప్పలనాయుడు,పైడం నాయుడు,లాలం రవీంద్ర,గండి మహేష్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment