డోంట్ కే (మో)ర్
లాక్ డౌన్ విదుద్దంగా నడుస్తున్న మోర్ ఫెర్రో ఎల్లాయిస్
అదేబాటలో జయలక్ష్మీ ఫెర్రోల్లాయిస్
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు
మంత్రి బొత్స ఇలాకాలో ఇదీ దుస్థితి లో....
బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన పవర్
కరోనా కాదు... ప్రపంచం అంతమై పోయినా మాకు డోంట్ కేర్ అన్నట్టుగా కొందరు వ్యవహారిస్తున్నారు. జిల్లాలో కొన్ని ఫెర్రోల్లాయిస్ కంపెనీలు ఇలాంటి యవ్వారాలకు పాల్పడి కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. పైగా తమకు అన్ని అనుమతులున్నాయంటూ చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అందునా మంత్రి బొత్స ఇలాకాలో ఇలాంటి యవ్వారాలు జరుగుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. గరివిడిమండలం కోడూరులో ఉన్న మోర్ ఫెర్రో ఎల్లాయిస్ ప్రపంచం ఏమైపోతే మాకేంటి అన్నట్టుగా అభం శుభం తెలీని కార్మికుల జీవితాలతో ఆటలాడుతోందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుంటే ఫెర్రో కంపెనీలు మాత్రం కరోనా మాకు చుట్టం మాజోలికి రాదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. పైగా చాలా నష్టాల్లో ఉన్నాం కొద్దిమంది కార్మికులతోనే నడుపుతున్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పడం మరీ వింతగా ఉంది. అయితే లా డౌన్లో అత్యవపరమైన ఆహార ఉత్పత్తులు, వ్యవసాయాధారిత పరిశ్రమలు తప్పిస్తే ఇతర పరిశ్రమలు తెరవాలని ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా కొన్ని కంపెనీలు మాత్రం మాకు అనుమతులున్నాయని యదేచ్చగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక అదేబాటలో బంటుపల్లి లో ఉన్న జయలక్ష్మీ ఫెర్రో ఎల్లాయిప్ కూడా తన పని తాను కానిచ్చేస్తోంది.మోర్..... అయితే వీరు లాక్ డౌన్ పాటించకుండా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నా లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. పనిలోకి వచ్చిన కార్మికులను తిరిగి ఇంటికి పంపించకుండా కంపెనీలోనే ఉంచి వారికి ఆహారం ,వసతి సదుపాయాలు కంపెనీలో కల్పించాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. కార్మికులు తమ విధులు ముగించుకుని నేరుగా ఇళ్ళకు వెళ్తున్నారని దీంతో వారి కుటుంబాల పరిస్థితి ఎంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీకి రోజు బయటనుంచి వాహనాలు, వ్యక్తులు రాకపోకలు , యదేచ్చగా సాగిస్తుండడం ఈ మహ్మమారి ఏరూపంలో ఎలా కాటు వేస్తోందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇలా కొందరు తమ స్వార్ధంకోసం ఎందరో జీవితాలు బుగ్గిపాలు చేయాలనుకోవడం తగదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు అత్యవసరమైనవి తప్పిస్తే ఇతర వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గర్శకాలు జారీచేసిందని వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఇలా వ్యవహారించడం ఎంతవరకు సమంజసమన్న భావన పర్వత్రా వ్యక్తమవుతోంది. అందునా మంత్రి బొత్స నియోజకవర్గంలోనే ఇలా జరగడం మరీ విడ్డూరంగా ఉందన్న గుసగుపలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
No comments:
Post a Comment