Followers

ఏరులై పారుతున్న నాటుసారా


ఏరులై పారుతున్న నాటుసారా


సీతానగరం,  పెన్ పవర్ : శివరామకృష్ణ


 కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వ వైన్ షాపులు మూసి వేయడంతో మండల కేంద్రం నందు గల చెట్టుగళ్ల పేట నందు మద్యం దొరకక మందుబాబులు అల్లాడిపోతున్నారు. మద్యం కొరతను ఆసరాగా తీసుకుని కొందరు బడాబాబులు మరి కొంతమంది వ్యాపారులు నాటు సారా వ్యాపారంలో మునిగి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తద్వారా వ్యాపారులు కాసులు సంపాదిస్తే నాటు సారా తాగి ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మద్యం షాపులు లేనందున నాటు సారా కు డిమాండ్ పెరిగిపోవడంతో కుటీర పరిశ్రమగా తయారయ్యాయి. ఈ వ్యాపారానికి అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తుల ఆశీస్సులతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. పనులు లేకపోవడంతో మందు బాబులు నాటు సారా అమ్మకాలు వద్ద కల్తీ మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నాటు సారా వ్యాపారిని అదుపులోకి తీసుకున్న ఓ పోలీస్ అధికారిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి వత్తిడి మేరకు వదిలేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం రహిత రాష్ట్రంగా ముఖ్యమంత్రి తీర్చిదిద్దాలని పని చేస్తుంటే పార్టీలో కొందరు తూట్లు పొడుస్తున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నాటుసారా వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...