అన్నార్తులను ఆదుకోవాలంటూ గృహ దీక్ష
ఎస్. కోట, పెన్ పవర్
లాక్ డౌన్ కారణంగా తింటానికి తిండి లేక అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున ఇబ్బందులు పడుతున్న అన్నార్తులను ఆదుకోవాలంటూ విజయవాడలో గల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సామాజికంగా దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ కు మద్దతుగా గుంకలాం గ్రామంలో గల తన నివాసంలో శృంగవరపుకోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బోగి రమణ శుక్రవారం గృహ దీక్షను చేపట్టారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరి కొన్ని నెలలు లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉందని ఇప్పటికే ఎంతో మంది పేదలు .అనాథలు. కూలీలు .కార్మికులు .చేతివృత్తుల వారు అనేక మంది తినడానికి తిండిలేక అలమటిస్తున్నారని ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అన్నారు పేదలను ఆదుకునేందు వరకు గృహంలోనే గృహ దీక్ష చేస్తానని ఆయన తెలిపారు, విజయనగరం పట్టణంతోపాటు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇప్పటి వరకు పేదలకు తనకు తోచిన సహాయం చేశానని మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడి వారికి అన్ని వేళలా ఆదుకుంటుందని ఆయన అన్నారు .
No comments:
Post a Comment