పేదలకు సేవ చేయాలన్నదే జగన్ సంకల్పం.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం( పెన్ పవర్)
పేద ప్రజలకు సేవలు అందించాలన్నదే సిఎం జగన్ సంకల్పం అని వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణశ్రీనివాస్ అన్నారు. మంగళవారం 21 వార్డ్ పరిధిలో చినవాల్తేర్ ప్రాంతంలో 520 కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలని , కరోనా మహమ్మారి పట్ల నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అన్ని రాష్ర్టాల కంటే మెరుగైన సదుపాయాలు కల్పించుటకు కృషి చేస్తున్నారని అన్నారు. లాక్డౌన్ వల్ల రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి ఇరుకున పడినప్పటికి ఎప్పటికప్పుడు నూతన ఒరవడితో పరిస్థితి ని చక్క దిద్దుటకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
No comments:
Post a Comment