Followers

ఏలేశ్వరం వశిష్ట బార్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు


 






ఏలేశ్వరం వశిష్ట బార్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.   

 

          
 ఏలేశ్వరం, పెన్ పవర్ : మాధవ్ 

 

మండల కేంద్రమైన ఏలేశ్వరం నగర పంచాయతీలోని వశిష్ట బార్ అండ్ రెస్టారెంట్ ను ఎక్సైజ్ ప్రత్యేక అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిపిన దాడుల్లో ఎక్సైజ్ మొబైల్ పార్టీ సి ఐ జె.వి.భవాని (నీలపల్లిమొబైల్ పార్టీ 3&4), ప్రత్తిపాడు ఎస్సై లు ఎం రామ శేషయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రామ శేషయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో వైన్ షాప్ లను బార్లను గతంలో సీల్ చేశామన్నారు. అయితే సీల్ చేసినప్పటికీ, ఇప్పటికీ సరుకు ఉందో లేదో అని జిల్లా కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం సీల్ చేయబడి ఉన్న బార్లో లిక్కర్ 180 ఎం.యల్  253, బాటిల్స్ , 950 ఎం.యల్ 20 బాటిల్స్,650 ఎం.యల్ బీర్ బాటిల్స్ 271 ఉన్నాయన్నారు. సీల్ చేసే సమయానికి ఇప్పటికే ఉన్న స్టాక్ లో వ్యత్యాసం లేకపోవడంతో యధావిధిగా తిరిగి బార్ ను సీల్ చేయడం జరిగిందని  తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు బార్ ను ఎవరు తెరువ రాదని ఆదేశించారు. ఆమె వెంట ప్రత్తిపాడు ఎక్సైజ్ ఎస్ఐ లు ఎస్ వి ప్రకాష్ కుమార్,  సిబ్బంది ఉన్నారు.


 

 




 

 


 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...