పాయకరావుపేట, పెన్ పవర్
లాక్ డౌన్ దృష్ట్యా బుదవారం పట్టణంలో బిచ్చగాళ్ళకు,నిరుపేదలకు దళితకులాల సంక్షేమ సేవా సంఘం ఆహార పొట్లాలను పంపిణిచేసారు.మండల కన్వినర్ నెలపర్తి అర్జున రావు,పట్టణ అద్యక్షులు పల్లా విలియంకేరి ఆద్వర్యంలో సంఘ సభ్యులు రోడ్డు పై స్థావరాలు ఏర్పరుచుకున్న 300మంది బిచ్చగాళ్ళకు ,పేదలకు పులిహోర పొట్లాలను,మజ్జిగ ప్యాకెట్ ,వాటర్ ప్యాకెట్టులను అందజేసారు.ఈసందర్ఫంగా వారు మాట్లాడుతూ కరోనా మహ్మారిని తరిమి కొట్టుటకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లో ప్రజలు స్వచ్చందంగా అమలు చేయాలని కోరారు..అదేవిదంగా సామాజిక దూరంను పాటించి వైధ్యనిపుణుల సూచనలు సలహాలు పాటించి మానవ జాతి మనుగడను కాపాడుకుందామని అన్నారు దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో మండలంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమంలను నిర్వహింస్తామని అన్నారు..ఈకార్యక్రమంలో చిరుకూరి పేర్రాజు,తాటిపాక లోవరాజు,నెలపర్తి నాగరాజు,ఏనుగుపల్లి అప్పారావు,జక్కల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment