అరిపు కామేష్ సొంత నిధులతో స్ప్రే
అనకాపల్లి, పెన్ పవర్
జీవీఎంసీ 84 వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కామేష్ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చేయూతను అందించారు. గొల్ల వీధి తదితర ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం పలు చోట్ల సోడియం హైడ్రో ఫ్లోరైడ్ కెమికల్ ను పిచికారి చేయించి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని చెప్పారు. జయంతుడు వ్యక్తిగత పరిసర ప్రాంతాల శుభ్రతను మెరుగు పరచుకోవాలి అన్నారు. ఎమ్మెల్సీ జగదీష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆదేశాలతో తాను ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. వార్డు నాయకులు కార్పొరేట్ అభ్యర్థిని లలిత తదితరులు పాల్గొన్నారు. స్వయంగా స్ప్రే ను పైపులతో వారే కొట్టడం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment