అక్రమంగా తరలిస్తున్న 495 కేజీల సారా బెల్లం స్వాధీనం.
గోకవరం, పెన్ పవర్ ప్రతినిధి : శివ రామ కృష్ణ
తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కాకినాడ డి అరుణ రావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అడబాల సతీష్ వారి సిబ్బంది తో గోకవరం మండలం వీర లంక పల్లి గ్రామ పరిధిలోని కోరుకొండ నుండి గోకవరం వెళ్ళు దారిలో వాహన తనిఖీ నిర్వహించి చుండగా గోకవరం నుండి అక్రమంగా సారా తయారీ కి ఉపయోగించు 495 కేజీల బెల్లం బస్తాలను మరియు u1 రవాణాకు ఉపయోగించు ఆటోను స్వాధీనపరచుకొని సదరు బెల్లం రవాణా చేయుచున్న వెదురుపాక గ్రామానికి చెందిన కోమటి దుర్గారావు మరియు బుర్ర గోవిందరాజులు అను ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలియజేసినారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది జానీ రమణ బాల దేవి పాల్గొన్నారని తెలిపినారు .మరియు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఏ విధమైన మద్యం నాటు సారాయి ,కళ్ళు ఇతర మత్తు పదార్థాలను తయారీ రవాణా మరి అమ్మకాలను ఉపేక్షించేది లేదని ఎస్సై తెలిపినారు. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ తరలించారు.
No comments:
Post a Comment