లాక్ డౌన్ పొడిగింపు నేపాధ్యంలో తన సేవ కార్యక్రమలు కొన సాగుతూనే ఉంటాయి 5 వార్డ్ టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు .
మధురవాడ, పెన్ పవర్ ప్రతినిధి సునీల్
కరోనా వైరస్ మహమ్మారీ కట్టడి నేపాధ్యంలో లాక్ డౌన్ మే 3వ తేది వరుకు కోనసాగుతుంది అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మెరుకు జివిఎంసి 5 వార్డ్ టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి.లక్ష్మణరావు ఆద్వర్యంలో సేవ కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. లాక్ డౌన్ వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న నిరాశ్రాయులకు, నిరు పేదలకు 5 వార్డ్ ప్రజలందరికీ కూరగాయల పంపిణీ గత వారం రోజుల నుండి చేస్తున్నారు. బుధవారం మొల్లి లక్ష్మణరావు 5 వార్డు మారికవలస (వైట్ బిల్డింగ్స్) పరిధి ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేశారు. పేదలకు, రోజు కూలీలకు, నిరాశ్రాయులకు మే 3వ తేది వరుకు 5వ వార్డులో నిరుపేదలకు నిరాశ్రయులకు, పేద ప్రజలకు తన వంతు సహాయం కొనసాగుతూనే ఉంటుందని ఐ న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. ఈకార్యక్రమంలో వాండ్రంశి అప్పలరాజు,మన్యల సోంబాబు, పిల్లా వెంకట్రావు, పిల్లా నర్సింగరావు , బోయి శీను, నాగోతి సత్యనారాయణ, (జపాన్), నాగోతి శివాజీ, నమ్మి శ్రీను, ఈగలరవి,తదితరులు పాల్గున్నారు..
No comments:
Post a Comment