Followers

రాష్ట్రంలోనే మొట్టమొదటి కారోనా వ్యాధినిరోధక ద్వారం ఏర్పాటు


విజయనగరం,  పెన్ పవర్


 


రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా విజయనగరం పట్టణంలో కరోనా వ్యాధినిరోధక ద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం నాడు ఉదయం పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ఏర్పాటుచేసిన కరోనా వ్యాధినిరోధక ద్వారాన్ని ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ ను కట్టడి చేస్తున్న ఈ పరిస్థితులలో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటించి, సామాజిక దూరంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా అధికారులు పట్టుదలతో వైరస్ ను కట్టడి చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు చేపడుతున్నారు అని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఇటీవల తమిళనాడులో జన సమూహం ఉన్న ప్రాంతాలలో చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితిని మాధ్యమాల ద్వారా చూసి, ప్రస్తుత పరిస్థితులలో విజయనగరం ప్రజలకు తమ వంతు సహాయంగా కరోనా వైరస్ నిరోధానికి ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. మున్సిపల్ అధికారులు కూడా తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కొత్తతరం ముందుకురావడం, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. విజయనగరం పట్టణంలో జన సమూహాలు ఉన్న ప్రాంతాలలో కరోనా వైరస్ నిరోధక ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా చేతులు శుభ్రంగా ఉండడం, కరోనా ను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ కరోనా నిరోధక ద్వారానికి తన సొంత నిధులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ కరోనా కట్టడికి యువత కూడా భాగస్వామ్యం అవ్వడం, ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని ద్వారాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం గా ఏర్పడి గత సంవత్సర కాలంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీవీ మాధ్యమాలలో చూసిన పరిశుభ్రత ద్వారాలను విజయనగరం ప్రజలకు చేరువ చేయాలని, రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా విజయనగరం కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సూచనలతో జన సందోహం ఉన్న ప్రాంతాలలో ఈ ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆసాపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, నియోజకవర్గ అ యువజన విభాగం అధ్యక్షులు అల్లు చాణక్య, బిజినెస్ ఆఫ్ యూత్ విజయనగరం ప్రతినిధులు అభినాష్ గాంధీ, బాలాజీ, హరికృష్ణ, చిన్ని ప్రదీప్, కాళ్ల సునీల్, రమేష్, యస్ యస్ కంప్యూటర్స్ కిరణ్, దుర్గ, వై గేర్ ప్రసాద్, అబ్దుల్ తదితరులు ఉన్నారు...


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...