90ల లీటర్ల నాటు సారా తో ఇద్దరి అరెస్ట్.
ఏలేశ్వరం, పెన్ పవర్ : మాధవ్
ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్ల పూడి గ్రామం నుండి ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి పుంతదారిలో మోటార్ సైకిల్ పై తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏలేశ్వరం ఎస్ ఐ కె. సుధాకర్ వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద శంకర్ల పూడి కి చెందిన నెర్ల సురేష్, కాపారపు మురళి అనే యువకులు తమ హీరో హోండా మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా గోనెసంచి తో రావడం గమనించి వారిని సోద చేశామన్నారు. గోనెసంచిలో పాలిథిన్ కవర్లతో కట్టి ఉన్న 9 సారా ప్యాకెట్లను వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు. ఆ ప్యాకెట్లలో 90 లీటర్ల వరకు నాటుసారా ఉన్నట్టు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న సారా తో పాటు నిందితులను ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపడుతున్నాం అని ఎస్ఐ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి ప్రతిపాడు కోర్టుకు తరలిస్తామని ఆయన అన్నారు.
Attachments area
No comments:
Post a Comment