Followers

అనకాపల్లి లో రేషన్ బియ్యం రాజకీయం



 







 

ఎంపీ సత్యవతి కి తెలియకుండానే

 


--  రేషన్ బియ్యం రాజకీయం

 

-- ఎంతో మందికి పెట్టిన ఘనత ఆమెది

 

-- ఇది సరికాదంటున్న అభిమానులు

 

అనకాపల్లి , పెన్ పవర్

 

ఎంపీ సత్యవతి కి తెలియకుండానే రేషన్ బియ్యం రాజకీయం నడుస్తుంది. ఆమె నివాసం ఉంటున్న వీధిలోకి వాహనం రావడం, దీనిపై కొందరు ప్రత్యర్థులు రాజకీయ విమర్శలకు దిగడం జరిగిపోయింది. ఇది తెలిసిన ఆమె నివ్వెర పోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఎంపీపై  సరికొత్త రాజకీయం తెర లేవడం పై పలువురు విస్తుపోతున్నారు. అదీ రేషన్ బియ్యంపై రాజకీయం చేయడం విడ్డూరంగా నిలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం ఆమె దగ్గరే డబ్బులు తీసుకున్న నాయకులు సైతం విమర్శించడం పై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ విషయం దొరుగుతుందా అని వేచి చూసే విమర్శకులు ఇదొక రాజకీయ సూచికగా ఎన్నుకోవడం విమర్శ చేయడం మొదలు పెట్టేశారు. లోతుగా ఆలోచిస్తే అదేమంత పెద్ద విషయమా నిజానిజాలు ఏమిటి అనే ఆలోచనను పక్కన పెట్టేశారు. రాజకీయాల్లోకి వచ్చినా తన పని తను చేసుకోవడం తప్ప ఇతరులపై విమర్శలు చేయని ఎంపీ సత్యవతి ని ఇలాంటి సాదాసీదా విషయంలో రాజకీయ విమర్శలకు ఎంచుకోవడం సరికాదనేది క్షేత్రస్థాయిలో అభిమానుల మాట. 

         ఒక విధంగా రాజకీయాల్లోకి రాకముందే  డాక్టర్ సత్యవతి గా ఎన్నో సేవా కార్యక్రమాలను తన సొంత నిధులతో చేసిన ఘనత అందరికీ తెలిసిందే. పైగా వైద్య సేవల్లో సైతం అనేక మందికి నామమాత్రపు ఖర్చులతో సహాయపడే వేలాది మంది అభిమానులును చూరగొన్నారు. సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె విజయంలో ఇదే ప్లస్ పాయింట్ కూడా. అంతేకాకుండా ఎంతోమంది సేవా కార్యక్రమాల పేరిట ఆమె నుంచి సేకరించిన వైనం బహిరంగమే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా పదవిలో లేనప్పుడు ఆమె చేసిన ఖర్చు ఎక్కువే. ప్రజలకు సేవ చేయడంతోపాటు నాయకులకు ప్రకటనల రూపంలో చాలా ఖర్చు చేశారన్న వాదన లేకపోలేదు. ఎంపీ అయ్యాక కూడా తాను చేపట్టే సేవ కార్యక్రమాలు ఆపలేదనేది అభిమానుల పాట.

       అలాంటి నేపథ్యం కలిగిన డాక్టర్ ఎంపీ సత్యవతి పై రేషన్ బియ్యానికి సంబంధించి రాజకీయ విమర్శలు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అసలు ఈ వైనం వెనకాల రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్నదే ప్రశ్న. రేషన్ బియ్యం తో కూడిన వాహనం ఎంపీ నివసించే వీధిలోకి వెళ్లడమే దీనికి కారణం. అది కూడా అ సదరు ఎంపీ కి తెలియదు అనేది ప్రచారం. అది కూడా అదేమంత విలువైన వస్తువు కూడా కాదు. ఆమె పదిమందికి నిధులు ఇచ్చే స్థాయిలో ఉండడంతో పాటు పదవిలో ఉండడంతో మెరుగైన పనులే చేయించుకోవచ్చు. దీనిని బట్టే అయినా జరిగిన ఉదంతానికి ఎంపీ కి సంబంధం లేదని ఇట్టే తెలిసిపోతుంది. ఇదంతా ఒకటైతే అసలు రేషన్ బియ్యం రావడం పోవడం విమర్శలు లేవడం అంతా ఎంపీ సత్యవతికి తెలియకుండానే జరిగిపోవడం పై అభిమానులు విస్తుపోతున్నారు. ఎప్పుడు రాజకీయపరంగా ఇతరులపై విమర్శలకు దిగడం అలవాటు లేని ఆమెపై ఇలాంటి విమర్శలు లేవడం పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.







No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...