Followers

ప్రత్యేక సర్వే ద్వారా ట్రూ నట్ టెస్ట్, రాపిడ్ టెస్ట్ లు


మధురవాడ, పెన్ పవర్ ప్రతినిధి: సునీల్


 


కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా జి వి ఎంసి జోన్-1 పరిధిలో గల అన్ని వార్డులలో జ్వరం, జలుబు, దగ్గు,  సంబంధిత లక్షణాలతో బాధ పడుతున్న వారిని, వయోవృద్ధులను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి వారికి ట్రూ నట్ టెస్ట్, రాపిడ్ టెస్ట్ లను చేయిస్తున్నట్లు జీవీఎంసి జోన్-1 కమిషనర్ బొడ్డేపల్లి రాము  పెన్ పవర్ ప్రతినిధికి తెలియజేశారు. శనివారం స్వతంత్ర నగర్ సచివాలయం లో రాపిడ్ టీంసభ్యులు, కేజీహెచ్ ఈ ఎన్ టి విభాగ వైద్యులతో సుమారు 120 మంది అనుమానితులకు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి జోనల్ కమిషనర్ సమక్షంలో రాపిడ్ టెస్టులు నిర్వహించారు. వార్డ్ ఈ.డి.పి సెక్రెటరీ, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, పి.హెచ్.సి ఎఎన్ఎంలు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు జోన్-1 కమిషనర్ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బొడ్డేపల్లి రాము మాట్లాడుతూ కరోనా వ్యాధి పై విస్తృత అవగాహన కల్పించి అప్రమత్తం గా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాలలో స్ప్రే చేయడం, బ్లీచింగ్ చల్లడం, జోన్-1 అన్ని వార్డులలో నిరంతర శానిటేషన్ ప్రక్రియ జరగాలని, వివిధ అనారోగ్యా సమస్యలతో బాధ పడుతున్న వారితో పాటుగా, అరవై సంవత్సరాల పై బడి ఉన్నవారికి  లక్షణాలు లేనప్పటికీ  ట్రూ నట్ టెస్ట్ లను చేసి డైలీ రిపోర్ట్ ను అందజేయాలన్నారు. సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకుండా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ సిబ్బంది కేజిహెచ్ ప్రొఫెసర్లు, సెక్రెటరీలు,వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆర్ శ్రీనివాసరావు, కె అలేఖ్య, యు రాజేశ్వరి, బివాసంతి,ఎన్. కుమారి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...