తుమ్మరి గడ్డలో మునిగి ఇద్దరు బాలురు మృతి
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం / మధురవాడ పెన్ పవర్ ప్రతినిధి : సునీల్
స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు గడ్డ లో మునిగి మృత్యువాత పడ్డారు. వివరాలు లోకి వెళితే నగరంలోని పోతినమల్లయ్య పాలెం కి చెందిన ఐదుగురు బాలురు బుధవారం స్నానం చేసేందుకు సమీపంలో ఉన్న తుమ్మేరు గడ్డ కు వెళ్లారు. గెడ్డలో దిగి ఈత ఈదుతుండగా ఒక బాలుడు నీటిలో మునిగిపోయాడు. ఆ బాలుని రక్షించే ప్రయత్నంలో మరో బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మిరి గడ్డలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. పీఎం పాలెం ఆర్హెచ్ కాలనీకి చెందిన ఐదుగురు విద్యార్థులు కరోనా వైరస్ కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ ఆటలాడుకుంటున్నారు, బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పీఎం పాలెం ఆఖరి బస్టాప్ దగ్గరలో గల తుమ్మరి గడ్డ జలాశయంలో ఈతకు దిగారు వీరిలో భాగ్య సాగర్ 15, మహేష్ వీరభద్ర 14, నీటిలో ఊబిలో చిక్కుకొని ఊపిరి అందక అక్కడికక్కడే మృతి చెందగా మౌళి కిరణ్ 7 , శివ 10, మహేష్ 13 ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ పరిస్థితి గమనించిన స్థానికుల సమాచారంతో పి ఎం పాలెం పోలీసులు, సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని శవాలను వెలికి తీసి మృతదేహాలను మార్చురీకి తరలించారు, జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు స్నేహితులు ఒకేసారి మృతి చెందడంతో బాలుర తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
No comments:
Post a Comment