పేదలకు వైకాపా నాయకుల చేయూత
అనకాపల్లి, పెన్ పవర్
మండలంలో రేబాక, కాపుశెట్టివానిపాలెం, గురజాడనగర్ లో వైస్సార్సీపీ నాయకులు బంటు ఏడుకొండలు, కోట సత్తిబాబు, ఇల్లా సత్తిబాబు ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయలను పంపిణీ చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి ఇంటింటికి 850 గృహాలకు కూరగాయలు అందించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజల అందరూ బయటకు రాకుండా ప్రభుత్వం చేపడుతున్న జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ మూర్తి, కోట చిన్న, బంటు కృష్ణ, వనమాల భూషణ్ రావు, కణికెళ్ల లక్ష్మణ్ వైస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment