86వ వార్డులో దామా వెనుక జన ప్రభంజనం ... దామా సమక్షంలో 200 మంది వైసీపీ తీర్ధం ..
గాజువాక , పెన్ పవర్ : శ్రీనివాస్
ప్రజా సేవే పరమార్ధంగా భావించి నిత్యం ప్రజా సమస్యల పై అలు ఎరుగని పోరాట నాయకుడు, ప్రజా సేవకి కృషి చేసే యోధుడు దామా సుబ్బరావు అని 86వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మెడికల్ బాబు అన్నారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, 86వ వార్డు వైసీపీ అభ్యర్ధీ దామా సేవలు మరువని అని మెడికల్ బాబు అన్నారు, కరోనా మహమ్మారి నేపాధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో నిరు పేదలు, నిరాశ్రయులు, రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వడంతో 86వ వార్డులో ప్రతి రోజు వైసీపీ నాయకులు దామా సుబ్బరావు నిత్య అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసారు, అలాగే వార్డులో కాశీపాలెం, యాతపాలెం, కూర్మన్నపాలెం,ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతంలో నిరుపేదలకు, ప్రజలకు నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయాలు పంపిణి చేసారు దామా సుబ్బరావు, అలాగే వైసీపీ నాయకులు దామా సుబ్బరావుగారు ఆశయాలు , సేవ కార్యక్రమలకు ఆకర్షితులై 86వ వార్డు ప్రజలు దామా సుబ్బరావుకి బ్రహ్మరధం పడుతున్నారు, 86వ వార్డు రెల్లివీధీకి చెందిన 200 మంది దామా సుబ్బరావు సమక్షంలో వైసీపి తీర్ధం పుచ్చుకున్నారు, దామా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు, కార్యక్రమంలో మెడికల్ బాబు, చెగొండి శ్రీనివాస్ , బార్ సాయి , పెంటారావు, మాటూరి శ్రీను, మురళి,సుహసిని తదితరులు పాల్గున్నారు
No comments:
Post a Comment