హాజరు అయిన ఎమ్మెల్యే అధీప్ రాజు
పరవాడ పెన్ పవర్
పరవాడ:జివిఎంసి పరిధిలోని 84 వ వార్డ్ సాలాపువాని పాలేం లో స్థానిక వైసిపి నాయకులు వార్డ్ లోని కుటుంబాలకు కూరగాయల పంపిణీ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొని పంపిణీ చేశారు.అనంతరం అధీప్ రాజు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధిని అరికట్టేందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.నిత్యావసర వస్తులకు బయటికి రాక తప్పని పరిస్తుల్లో వచ్చినప్పుడు ప్రజలు కూడా వారి వ్యక్తిగత బాధ్యతతో బౌతిక దూరం కనీసం వ్యక్తికి వ్యక్తికి 5 అడుగుల దూరం పాటించి ముఖానికి మాస్కు కానీ రుమాలు కానీ ధరించి ఎవరిని ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ సరుకులు కానీ కూరగాయలు కానీ మాంసమ్ దుకాణాల దగ్గర కానీ ఖరీదు చేస్తే అందరికి శ్రేయస్సు కరం అని తెలియ చేశారు.కానీ ప్రజలు కొందరు ఆశ్రద్ధతో ఈ జాగ్రత్తలు పాటించడం లేదు అని అన్నారు.చాలా మంది రోజువారీ వేతన కార్మికులు స్వీయ నిర్బంధ వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే సాయం తో పాటు స్థానిక నాయకులు కూడా వారికి తోచిన విధంగా ప్రజలను ఆదుకోవాలి అని పిలుపు నిచ్చారు.సోమవారం స్థానిక వైసిపి నాయకులు సాలాపు నానాజీ,సాలాపు అప్పారావు,మరియు వైసిపి పార్టీ నాయకుల ఆర్ధిక సాయంతో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహింస్తున్న నాయకులను అధీప్ రాజ్ అభినoదించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే టప్పుడు నాయకులు కూడా బాధ్యతతో వ్యవహరిస్తూ వ్యక్తులు మధ్య బహుతిక దూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దళాయి నదియా,సాలాపు నానాజీ,సాలాపు అప్పారావు,సాలాపు బాబురావు,మహాలక్ష్మి నాయుడు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment