ఘనంగా నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు......
పెన్ పవర్, ఉలవపాడు: ఓ. రాధకృష్ణ
మండల కేంద్రమైన ఉలవపాడు తాహసీల్దార్ కార్యాలయం నందు టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ఎంపీడీవో టి రవి కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు శనివారం నాడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అన్ని శాఖలకు చెందిన ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు మాట్లాడుతూ కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త బహుజనుల విద్యా ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారని ఆయన అనగారిన కులాల వర్ణ వర్గాల కోసం ఎంతో పాటు పడ్డారు అని అతను అంటరానితనాన్ని నిర్మూలించాలని కుల వ్యవస్థ నిర్మూలన తోపాటు మహిళో ద్దరణకు ఎంతో కృషి చేశారని కులాల వెనుకబాటే తనాన్ని తొలగించి అనగారిన కులాల వారందరికీ విద్యనందించారని వితంతువుల చేరదీశారని అంటరానితనాన్ని నిర్మూలించారు అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు ఎంపీడీవో టి రవి కుమార్, ఏపీ ఎం బెజ్జం రమేష్ బాబు, తాహసీల్దార్ పి మరియమ్మ, వ్యవసాయాధికారి మాల్యాద్రి, ఎస్ ఐ యం దేవకుమార్, కరేడు డాక్టర్ కె శ్రీనివాసరావు, టీచర్ సుదర్శి భాస్కర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది, వాలంటీర్లు పంచాయతీ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు మాజీ జడ్పీటిసి కోటు కోటిలింగం రామాల సింగారెడ్డి పజిల్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment