మాకు ఉన్నారు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావాలంటే ప్రాణభయంతో భయపడి పోతున్నారు.
ఆదివాసి అడవి బిడ్డల ఆకలి తీర్చడం కోసం తన ఆకలి సైతం మరచిపోయి అడవి బాట పట్టిన ఎమ్మెల్యే సీతక్క. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు లాక్ డౌన్ విధించిన అప్పటి నుంచి కూడా అడవి బిడ్డల ఆలనాపాలనా చూస్తూ అండదండగా ఉంటూ అమ్మగా,అక్కగా ఆశ్రయం ఇస్తుంటే ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి ఎమ్మెల్యే అంటే ఇలా చేయాలి ఎమ్మెల్యే అంటే ఇలా ఒకరికి ఆదర్శం కావాలి అనేలా మరిచిపోలేని విధంగా ప్రజలకు ప్రజా సేవ చేస్తుంది. అక్కడ ఆదివాసి బిడ్డలంతా ఈ సీతని ఎమ్మెల్యేగా గెలిపించు కోకుండా ఉండుంటే ఆకలి కేకలతో ఇప్పటికే సగం చచ్చి ఉండేవాళ్ళం అనెంత నమ్మకం ఇచ్చింది. మేము ఎన్నో వందల మంది నాయకులను,ప్రజా ప్రతినిధులను చూశాం ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ సీతక్క లాంటి ఎమ్మెల్యేను జీవితంలో చూడలేదు అనేది నమ్మకం.
No comments:
Post a Comment