మనసున్న మా రాజు గొర్ల కనకారావు
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా ప్రభుత్వాలు రెండవసారి పొడిగించిన స్వీయ నిర్బంధం(లాక్ డవున్)కారణంగా గొర్లవానిపాలెం గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన గొర్ల కనకారావు.ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి వారి కష్టాలను తీర్చడానికి ముందుకు వచ్చిన నాయకుడే మహనీయుడు ఆ కోవకు చెందిన నాయకుడే కనకారావు.లాక్ డవున్ మొదలు అయి నెలరోజులు పూర్తి అయినది రోజువారీ కార్మికులు గాని చిన్న చిన్న వ్యాపారులు గాని మధ్యతరగతి కుటుంబీకులు కానీ వికలాంగులకు కానీ ఎవరికి అయినా రెక్కాడితే డొక్కాడని రోజులు ఇవి అలాంటి వారికి నెలరోజుల నుండి గృహ నిర్బంధం లో ఉండిపోవడం వలన ఆర్ధిక సమస్యల తో నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి కష్ట సమయంలో వారికి అండగా నిలిచి ఒకొక్క కుటుంబానికి సుమారు 20 రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులను కనకారావు అందరికి బుధవారం పంపిణీ చేశారు.మొదటి విడత లాక్ డవున్ లో 15 రోజులకు సరిపడా కూరగాయల్ని కనకారావు పంపిణీ చేసిన సంగతి అందరికి తెలిసిందే లాక్ డవున్ పెరగడం వలన వారికి నిత్యావసర సరుకుల అవసరం అని గుర్తించి కుటుంబానికి 10 కేజీల బియ్యము,1 కేజీ పంచదార,1 కేజీ కందిపప్పు,1 కేజీ సాల్ట్,1 కేజీ గోధుమపిండి,అరకెజి సెమియా మొత్తం అరురాకాలు కలిసి 800 వందల కుటుంబాలకు సరుకులను పంపిణీ చేస్తున్నారు.చాలా మంది నాయకులు ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ పేరుతో కవర్ల మీద,బ్యాగుల మీద వారి పార్టీ నాయకులు,పార్టీ గుర్తులు వేసుకొని ప్రచారం చేసుకుంటుoడoగా గొర్ల కనకారావు ప్రజల శ్రేయస్సు కోరి తన ఫోటో తోపాటు ఇంటిలో ఉండండి సురక్షితంగా ఉండండి(స్టే హోమ్ స్టే సేఫ్)అని వ్రాయించి ప్రజలను ఇళ్లలోనే ఉండండి అని అభ్యర్ధిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కురాగాయలకన్నా నిత్యవసర సరుకులు అవసరం ఉంది అని ఎవరు అయినా అలాంటివి ఇస్తేనే వారికి ఉపయోగ పడతాయి అని కనకారావు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో గొర్ల శ్రీనివాసరావు మాజీ ఎంపిటిసి,యాసరపు కనకారావు మాజీ ఎంపిటిసి,గోగాడ ధనరాజు,ఎ సన్యాసి నాయుడు,నరవ నాగరాజు,భయలపూడి రాజు,రాయవరపు అప్పారావు, జి.కే యూత్ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment