Followers

విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.


 


విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


విశాఖ  కేంద్ర కారాగారం నుంచి  74  మంది  ఖైదీలను  విడుదల చేశా మని  కేంద్ర కారాగారం  పర్యవేక్షణాధికారి  ఎస్ . రాహుల్  తెలిపారు. బుధవారం ఆయన  మాట్లాడుతూ  కరోనా వైరస్  ప్రభావం  కారణంగా లాక్ డౌన్  అమలు జరుగుతున్న   సందర్భంగా  కారాగారంలో ఉన్న  ఖైదీలను  మధ్యంతర బెయిల్  పిటిషన్ పై   విడుదల చేయాలని  సుప్రీం కోర్ట్  మరియు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  ఆదేశాల మేరకు  కారాగారంలో ఉన్న   53 మంది రిమాండ్ ఖైదీలు 21 మంది శిక్ష ఖైదీలు  మొత్తం 74 మందిని  మార్చి 31న విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ సందర్భంగా  కారాగారంలో ఉన్న  ఏడుగురు మహిళలతో 74 మంది ఖైదీలను  విడుదల చేయడం జరిగిందన్నారు. విశాఖ  ఏడవ  అడిషనల్ మెట్రోపాలిటన్  మేజిస్ట్రేట్  జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఖైదీలను ఇళ్లకు  పంపించామని  తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా  ఖైదీలు  సామాజిక దూరం  వ్యక్తిగతవ శుభ్రత  పాటించాలని  ఎల్ల కే పరిమితం కావాలని   రాహుల్  సూచనలు  ఇచ్చారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...