ఇంటి అవసరాలకు బయటకు వెళ్లేవారు ఆధార్ తప్పనిసరి. కమిషనర్ ఆర్కె మీనా
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం( పెన్ పవర్)
ఇంటి అవసరాలకు రోడ్ల పైకి వచ్చే వారు తప్పకుండా ఆధార్ కార్డు కలిగి ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా అన్నారు. బుధవారం నగరంలో భద్రతా చర్యల పై ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రజలు ఏంటి అవసరాలకు రోడ్లపైకి వచ్చే వెసులుబాటు కల్పించారు. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో భాగంగా నగరంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశామన్నారు. మూడు గంటల పాటు ఇంటి అవసరాలు తీర్చుకునే నిమిత్తం రోడ్ల పైకి వచ్చే ప్రజలు తప్పక నిబంధనలు పాటించాలని కోరారు. చక్ర వాహనం పై ఒకరు ఫోర్ వీలర్ పై ఇద్దరు మాత్రమే తిరగ వచ్చని అన్నారు. నివాస గృహాలకు 2 నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న దుకాణాలలో మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ఏ ఒక్కరూ పరిమితి దాటిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల పైకి వచ్చే ప్రతి ఒక్కరు ఆధార్ కలిగి ఉండాలని లేనిపక్షంలో కేసులు తప్పవు అని ఆర్కె మీనా తెలిపారు.
No comments:
Post a Comment