Followers

సప్త  సూత్రాలు ప్రజలందరు పాటించాలి : బిజెపి నాయకురాలు  అరుణ కుమారి.




ప్రధాని  సప్త  సూత్రాలను  ప్రజలు  తప్పకుండా  పాటించాలి.  బిజెపి నాయకురాలు  అరుణ కుమారి

 

 

  పెన్ పవర్, స్టాఫ్ రిపోర్టర్ మజ్జి శ్రీనివాస మూర్తి,  విశాఖపట్నం

 

 

ప్రధాని   నరేంద్ర మోడీ  సప్త సూత్రాలను  ప్రజలు  తప్పకుండా  పాటించాలని  తూర్పు నియోజకవర్గం 18 వ వార్డు  భారతీయ జనతా పార్టీ  నాయకురాలు(  అభ్యర్థి) న్యాయవాది  డి వి ఎన్ ఎల్  అరుణ కుమారి  కోరారు. బుధవారం  ఆమె  ఎంవిపి అప్పఘర్  తదితర ప్రాంతాల్లో  పర్యటించి  ఇళ్ల కే పరిమితమైన  దినసరి  కూలీలకు  పేదలకు  నిత్యావసర  సరుకులు, కూరగాయలు  అందచేశారు. ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల  ప్రజా జీవనం స్తంబించి పోయిందని పేద మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో  ప్రజలు   కోసం  పకడ్బందీగా  తీసుకోవడం జరిగిందని  దాని ఫలితంగా  జిల్లాలో  వైరస్  అదుపులో ఉందన్నారు.  రాష్ట్రంలో  పెరుగుతున్న  కరోనా  పాజిటివ్ కేసులు  దృశ్య  ప్రధాని  రెండో విడత లాక్ డౌన్ ను   మే 3 వరకు  పొడిగించడం  జరిగిందన్నారు. కరోనా వైరస్  నియంత్రణకు  ప్రజలు  7 సూత్రాలను పాటించాలని సూచించారన్నారు  పెద్ద వయసు వారిపట్ల  జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. వ్యాధి నిరోధక శక్తిని సంపాదించుకోవాలి. కోవిడ్19 పై  పనిచేస్తున్న వారిని గౌరవించాలి. అవసరం అయిన వారికి  సహాయం అందించాలి.  ఆరోగ్య సేతు యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి అని ఆమె కోరారు.  నష్టానికి ఎదుర్కొని  మొదటి విడత లాక్ డౌన్ లో  నిలిచిన ప్రజలు  మోడీ సూచనలను  పాటించి  కరోనా మహమ్మారి ని  తరిమికొట్టాలని  అరుణ కుమారి పిలుపునిచ్చారు.

 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...