సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలు జోడిస్తున్న జివిఎంసి పారిశుద్ధ్య అధికారులు,
విశాఖపట్నం, పెన్ పవర్
కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు గుర్తించిన వారి నివాసం ఉండే ప్రాంతాల నుండి 5 కి.మీ పరిధి వరకు కంటికి రెప్పలా పారిశుద్ధ్య పనులు, రసాయనాలు చల్లడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కమిషనర్ డా.జి.సృజన ముఖ్యవైద్య ఆరోగ్యశాఖాధికారి, బయాలజిస్టును మరియు అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లును ఆదేశించారు. ప్రస్తుతం చాలా కఠినమైన గడియలు నడుస్తున్నందువలన, ప్రజలు కరోనా బారీ నుండి రక్షించుకొనే నిమిత్తం, జివిఎంసి తరపున తగినంత సేవచేయాలని, నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పారిశుద్ధ్య కార్మికుడు నుండి పై స్థాయి ఆరోగ్య అధికారులు వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. కమిషనర్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా, కరోనా సమస్యాత్మక ప్రాంతాలైన నాలుగవ జోన్‌లోని తాటి చెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో, గాజువాకలోని ఉడాకాలనీ, కుంచమాంబకాలనీ పరిసర ప్రాంతాల్లో, రెండవజోన్లోని అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాల్లోను వాహాన యంత్రాల ద్వారా రసాయనాలు జివిఎంసి బయాలజిస్టు, ఆయా జోన్ల అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా జల్లించారు. రసాయనాలు విరివిగా జల్లించడం పై ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
No comments:
Post a Comment