కరోనా వైరస్ పై ప్రత్యేక అవగాహన సదస్సు
....... సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి.
గోకవరం, పెన్ పవర్ ప్రతినిధి : సిబ్వ రామ కృష్ణ
తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో స్థానిక రామాలయం వద్ద కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి కరోనా వైరస్ పై ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కలిసిగట్టిగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు రాకుండా హోమ్ క్వారైంటెన్ పాటించాలన్నారు. అత్యవసరమైతే నే ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగకుండా సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. రాజమండ్రి ,రాజానగరం, కడియం ధవలేశ్వరం పలు ప్రాంతాలు కేసులు ఎక్కువై ప్రభుత్వం వారు రెడ్ జోన్ ప్రకటించారు కాబట్టి ప్రజలు ఎవరు ఆయా ప్రదేశాలకు వెళ్ళకూడదు అని సూచించారు. ఎవరైనా అటువంటి ప్రదేశాలనుంచి వచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చి తిరిగే వారిపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ లు రాము, గోవింద్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
No comments:
Post a Comment