61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం
మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత
విజయనగరం, పెన్ పవర్
సముద్రంలో చేపల వేటను ఈనెల 15 నుండి జూన్ 14వ తేది వరకు 61 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ (జిఓఆర్టి నెం .80, పశు సంవర్దక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ, తేది 26.3.2020) జారీచేసిందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు. సాంప్రదాయ బోటులకు (ఇంజను లేని పడవలకు) ఈ నిషేద కాలము వర్తించదన్నారు.
చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరంక్షించుట, వాటి ఉత్పత్తిని పెంచుట తద్వారా మత్స్య సంపద అభివృద్ది సాధించుట ముఖ్య ఉద్దేశ్యంగా ప్రతి సంవత్సరం ఈ వేట నిషేద కాలాన్ని పాటించడం జరుగుతుందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి మెకనైజడ్, మోటరైజడ్ బోట్లు వినియోగించి సముద్ర జలాలలో చేపల వేట చేయరాదన్నారు. వేట నిషేద ఉత్తర్వులు ఉల్లంఘించిన బోటు యజమానులపై ఎపిఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్య తీసుకోబడుతుందన్నారు. బోటు యజమానులందరూ ఈ నిషేద ఉత్తర్వులు పాటించాలని ఆమె కోరారు.
No comments:
Post a Comment