Followers

సీఎం కు కృతజ్ఞతలు తెలుపిన అర్చక సంఘం.


 

 

     స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

 

 ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు మేరకు దేవాదాయశాఖ ద్వారా 5000రూపాయలు ఆర్ధిక సహాయం ఇవ్వనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించటం పట్ల, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణా సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,వైసిపి నాయకులు  వడ్డాది ఉదయకుమార్ గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న అర్చకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్, దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణులకు, ఆ ప్రకటనలో ఉదయకుమార్ కృతజ్ఞతలు తెలియచేసారు.
 

 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...