బ్యూరో రిపోర్ట్ విజయనగరం. పెన్ పవర్: డేవిడ్ రాజ్
జిల్లాలో కరోనా వైరస్ నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ప్రజల సహకారంతో జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఆనందించదగ్గ విషయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం నాడు విజయనగరం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న p w మార్కెట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి కౌశిక్ ల ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో మహిళా విభాగం తరపున kovid 19 నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రిమిసంహారక(Dis Infection Tunnel) టన్నెల్ ను ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున క్రిమిసంహారక ద్వారాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 420 కేసులు నమోదయితే, అందులో 360 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారని తెలిపారు. మిగతా 60 కేసులు వివిధ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల నమోదైన కేసులు అని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 134 ప్రాంతాలలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగిందని, వాటిని హాట్ స్పాట్ గా గుర్తించి రాకపోకలు పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని మండలాలను మూడు జోన్లుగా విభజించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ గా విభజించడం జరిగింది అన్నారు. ముప్పై ఏడు మండలాలను రెడ్ జోన్ పరిధిలోని, 44 మండలాలను ఆరెంజ్ జోన్ పరిధిలో, 595 మండలాలు గ్రీన్ జోన్ పరిధిలో విభజించి లాక్ డౌన్ అమలులో కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల isolation బెడ్లు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో 5.3 కోట్ల జనాభాకు దాదాపు 16 కోట్ల మాస్కులు సిద్ధం చేసి ఒక్కొక్కరికి 3 మాస్కులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ తోపాటు, వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. రెండో విడత రేషన్ పంపిణీ కి తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. విజయనగరం జిల్లా ప్రజలు క్రమశిక్షణతో కూడిన వారని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసులు కూడా లేకుండా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ధరల నియంత్రణ విషయంలో తగు చర్యలు చేపట్టామని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ నివారణకు క్రిమిసంహారక ద్వారాన్ని కొద్ది రోజుల క్రితం రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, తన తండ్రి మరియు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనలతో, ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సేవా స్పూర్తితో మహిళా విభాగం తరపున కరోనా వైరస్ క్రిమిసంహారక ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా లో లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం, ప్రజల సహకారం, పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నేతలు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా డివిజన్ల మహిళా అభ్యర్థులు శ్రీమతి బి ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, aasapu సుజాత, ద్వాదశి సుమతి, తాళ్లపూడి సంతోష్ కుమారి, కనుగు ల తేజశ్రీ, పట్టా ఆదిలక్ష్మి, నాయిని పద్మ, లతోపాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కేదారి శెట్టి సీతారామమూర్తి( రాంపండు), జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, తదితరులు ఉన్నారు...
No comments:
Post a Comment