కైకరంకు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక రైస్ మిల్లు యజమాని కోనా శ్రీనివాసరావుతో కలిపి ఏడుగురిపై కేసు నమోదు
పెన్ పవర్, తాడేపల్లిగూడెం
ప.గో...జిల్లా ఉంగుటూరు మండలం కైకరంకు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక రైస్ మిల్లు యజమాని కోనా శ్రీనివాసరావుతో కలిపి ఏడుగురిపై కేసు నమోదు, జిల్లా కలెక్టర్ ప్రకటించిన నిషేధిత ఉత్తర్వులను ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా, ప్రాణాంతకంగా మానవ జీవితానికి ప్రమాదకరమైన వ్యాధుల సంక్రమణ వ్యాప్తి చెందడానికి కారణమవడం వంటి అభియోగలపై కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు. నిందితులు ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ఆహార పదార్థాలను పంపిణీ చేయడం, పంపిణీ సమయంలో సామాజిక, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వంటి వాటిపై కేసు నమోదు చేసిన చేబ్రోలు ఎస్సై వీర్రాజు ఎస్సై తన సిబ్బందితో విధుల్లో ఉండగానే నిందితులు లెక్కచేయకుండా ఈ దుశ్చర్యలకు పాల్పడటంతో కేసు నమోదు చేసిన పోలీసులు క్రైం నంబర్ 135/2020 ఐ.పి.సి. సెక్షన్ 143, 188, 269, సెక్షన్ 51 ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005 ప్రకారం కోనా శ్రీనివాసరావుతో పాటుగా ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
No comments:
Post a Comment