Followers

యుటిఎఫ్ ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.


యుటిఎఫ్ ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.

 

ఏలేశ్వరం, పెన్ పవర్ :

 

  మండలం యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండల పరిధి పలు గ్రామాల్లోని 550 నిరుపేద  కుటుంబాలకు బియ్యం కూరగాయలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ సీనియర్ నేత మెతకాని రాంబాబు మాట్లాడుతూ యుటిఎఫ్ ఉపాధ్యాయులు మండలంలోని రమణయ్య  పేట, తూర్పు లక్ష్మీపురం, జే అన్నవరం, మర్రివీడు, కంబాల పాలెం, ఏలేశ్వరం (వై ఎస్ ఆర్ సి దిబ్బలు) తదితర   గ్రామాల్లో పర్యటించి  నిరుపేదలను గుర్తించి నేరుగా వారికి సరుకులు  అందజేయడం జరిగింది అన్నారు.దీని వలన నిజమైన లబ్ధిదారులకు 1,20,000/-విలువచేసే బియ్యం కూరగాయలు అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు బివి మోహన్ రావు, ఎస్ గణపతి రావు, జి సుందర్ రావు, ఏ బి వి ప్రసాద్, ఏ ఆదివిష్ణు, ఎస్ రాజశేఖర్, కె ప్రభాకర్ రావు, జట్ల సోమరాజు, సిఐటియు నాయకులు రొంగల ఈశ్వరరావు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...