Followers

వమ్మవరం గ్రామంలో విషాదం...

 




వమ్మవరం గ్రామంలో విషాదం...

ఉపాధి కోసం వెల్లిన వ్యక్తి సింగపూర్ లో మృతి.

 అక్కడే దహన సంస్కారాలు చేసిన స్నేహితులు.

ఇంటికి చేరిన వీడియో క్లిప్ లు.వాటిని చూసి విలపిస్తున్న భార్య పిల్లలు

.

పెన్ పవర్... యస్ రాయవరం..(విశాఖ)

 

 

ఉపాధి కోసం సింగపూర్ వెల్లిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందిన సంఘటన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్న యి.కుటుంబం చివరి చూపు లకు సైతం నోచుకోలేదు. కరోనా మహమ్మారి కారణంగా రాకపోకలు స్దంబించి పోయాయి. ఈ పరిస్థితుల్లో శవాన్ని స్వస్థలం తీసుకు పోలేక స్నేహితులు మృతదేహాన్ని  అక్కడే దహన సంస్కారాలు చేసారు. దహన సంస్కారాలు చేసి న వీడియోలను భార్యకు పంపించారు.ఆ వీడియో లు చూసి చివరి చూపైన చూడలేక పోయామని భార్య పిల్లలు  కుటింబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మండలంలోని వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యరావు( 35) వెల్డింగ్ పని కోసం ఐదు నెలల కిందట సింగపూర్ వెళ్ళాడు. అక్కడ  ఒక కంపెనీలో పనిచే స్తున్నడు. సోమ వారం ఆకస్మికంగా సూర్యారావు మరణించి నట్లు భార్య శ్రావణికి   అక్కడ కంపెనీ ప్రతినిధులు ఫోన్లో సమాచారం  దజేశారు. విమాన సర్వీసులు లేకపోవడంతో మృతి చెందిన తన భర్త మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చే అవకాశం కూడా లేకపోయింది. దీంతో ఆమె తన భర్తను కడసారి చూపు చూసే వీలు లేకుండా పోయిందంటూ కన్నీటి పర్యంతమైనది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయిపోయాయి దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే వీలు లేకపోవడంతో అక్కడే అతని స్నేహితులు అంత్యక్రియలు జరిపించారు. సింగపూర్ లో సోమవారమే సూర్యారావు మృతదేహానికి అతని స్నేహితులు అంత్య క్రియులు జరిపి "ఆ వీడియోలను మృతుని కుటుంబ సభ్యులకు పంపారు -మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఈ సంఘటనతో వమ్మవరం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి .

 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...