ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించండి : ప్రధాని మోదీ
న్యూస్ డెస్క్, పెన్ పవర్
ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. 130 కోట్ల మంది ప్రజల సామూహిక శక్తి.. ప్రతి ఒక్కరిలో కనిపించిందన్నారు. దేశమంతా ఒక్కటై కరోనాపై పోరాటం చేసిందన్నారు. ప్రజలు ఈశ్వర స్వరూప మన్నారు. కోట్లాది మంది ప్రజలు ఇండ్లల్లో ఉన్నారన్నారు. కరోనాతో ఏర్పడిన నిరాశ నుంచి ఆశ వైపు ప్రజల్ని తీసుకువెళ్లాలన్నారు. కరోనాతో ఏర్పడిన అంధకారాన్ని పోగొట్టేందుకు దివ్య వెలుగుల్ని ప్రసరింపచేయాలన్నారు. ఏప్రిల్ 5వ తేదీన.. 130 కోట్ల మంది ప్రజలు మహాశక్తి జాగరణ చేయాలన్నారు. దేశ ప్రజలు మహాసంకల్పాన్ని ప్రదర్శించాలన్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాలను వెలిగించాలన్నారు. కేవలం 9 నిమిషాల సమయాన్ని కేటాయించాలన్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాలన్నారు. ఆ ప్రకాశంతో అంధకారాన్ని పారద్రోలాలన్నారు. మేం ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించాలన్నారు. ఎవరూ కూడా రోడ్లపై వెళ్లకూడదన్నారు. సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించకూడదన్నారు. కరోనా సైకిల్‌ను బ్రేక్ చేసేందుకు ఇదొక్కటే మార్గమని ప్రధాని తెలిపారు. 5వ తేదీన ఒంటరిగా కూర్చుని మహాభరతాన్ని గుర్తు చేసుకోండన్నారు. 130 కోట్ల ప్రజల సంకల్పాన్ని ఆలోచించాలన్నారు. గెలవాలన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలన్నారు. మన ఉత్సాహాన్ని మించిన శక్తి ఏదీ లేదన్నారు. ఈ ప్రపంచంలో మనశక్తితో జయించలేనిది ఏదీ లేదన్నారు.
No comments:
Post a Comment