విశాఖపట్నం/పూర్ణమార్కెట్, పెన్ పవర్ :సతీశ్ కుమార్
కరోనా వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్న జివిఎంసికి రూ.5.00 లక్షలు విరాళం ప్రకటించిన పల్స్ మరియు ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థలు విశాఖపట్నం, ఏప్రిల్ 25 :- నగర పరిధిలో కరోనా వ్యాధి నియంత్రణకు జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది చాలా శ్రమతో, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ దేనితో కూడా విలువ కట్టలేమని పల్స్స్ మరియు ఒమిక్స్ సి.ఇ.ఓ డా.గేదెల శ్రీనుబాబు ఒక కార్యక్రమంలో కొనియాడారు. కోవిడ్- 19 నివారణకు తగు చర్యలు చేపడుతున్న జివిఎంసికి ఆర్ధికంగా సహాయపడేందుకు గాను రూ.5.00 లక్షల విరాళం ప్రకటించారు. సదరు మొత్తాన్ని వి.ఎస్.ఇ.జెడ్ కమిషనర్ చేతుల మీదుగా జివిఎంసికి అందించే నిమిత్తం రూ.5.00 లక్షలు విరాళాన్ని వి.ఎస్.ఇ.జెడ్ కమిషనర్ రామ్మోహనరెడ్డికి చెక్కు రూపంలో అందించినట్లు పల్సస్ మరియు ఒమిక్స్ సి.ఇ.ఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొని విపత్కర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించామని అదేబాటలో జివిఎంసి చేస్తున్న సహాయ సహకారాలకు కూడా తోడ్పాటు అందిస్తున్నామని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసంస్థల డైరక్టర్, గేదెల శంకర్రావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment