Followers

పగడ్భందీగా  రెండవ విడత బియ్యం పంపిణీ జేసీ ఎల్.శివ శంకర్ ఆదేశం


పగడ్భందీగా  రెండవ విడత బియ్యం పంపిణీ
జేసీ ఎల్.శివ శంకర్ ఆదేశం


పాడేరు, పెన్ పవర్ ప్రతినిధి చక్రవర్తి


 


పగడ్బందీగా రెండవ విడత ఉచిత బియ్యం, పప్పు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. మంగళవారం తహసిల్దార్ లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం పంపిణీలో చౌక ధరల దుకాణాలు వద్ద భౌతిక దూరం పాటించాలని చెప్పారు. బియ్యం పంపిణీ కి అవసరమైన ఎలెక్ట్రానిక్ తూనిక యంత్రాలు సమకూర్చి పంపిణీ చేయాలన్నారు. గ్రీన్, బ్లూ పింక్, వైట్  కూపన్లు పంపిణీ చేసి ఆమేరకు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఈనెల 16న ప్రారంభించి 27 నాటికి పంపిణీ పూర్తి చేయాలన్నారు. డిపోల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి, సబ్బు, నీరు ఏర్పాట్లు చేయాలన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...