అల్లుడ్ని రాడ్ తో కొట్టి చంపిన మామ.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
దేవరాపల్లి మండలంలోని తెనుగుపూడి గ్రామానికి చెందిన గుమ్మడి రాజబాబు అనే వ్యక్తి తన అల్లుడైన దాసరి కృష్ణని ఐరన్ రాడ్డుతో మంగళవారం రాత్రి సాతిపై కొట్టి చంపినట్లు చోడవరం సర్కల్ ఇన్స్ పిక్టర్ (సిఐ) కె.ఈశ్వరరావు బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే అల్లుడ్ని చంపిన సొంత పిల్లనిచ్చిన మామా గుమ్మడి రాజబాబు అల్లుడ్ని చంపి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన దాసరి కృష్ణ సుమారు 36 ఆటో డ్రైవరుగా పని చేస్తుండేవాడని, తన భార్య వెంకటలక్ష్మి అ గ్రామంలో కూరగాయలు వ్యాపారం చేసేవారని, వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం నిందుతుడు గుమ్మడి రాజబాబు అ కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఆయన తెలిపారు. దీని పై కేసునమోదు చేసి, ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన దాసరి కృష్ణని పోస్టుమార్టం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment