శ్రీకాళహస్తి సంకల్పానికి ముందుకు రండి
చిత్తూరుజిల్లా... శ్రీకాళహస్తి, పెన్ పవర్
తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్రప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయమని నిధులను ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేశారని ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందుతున్న వెయ్యిరూపాయలు కేంద్రప్రభుత్వంనుంచి వచ్చినా సహాయమని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు అదేవిధంగా కరోనా వైరస్ నివారణ కోసం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గట్టి సంకల్పం చేపట్టారని, ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. దేశాన్ని సమైక్య దిశగా నడిపిస్తూ గట్టి సంకల్పబలంతో ఆపత్కాలంలో కరోనా ఎదుర్కోడానికి ప్రధాని పిలుపు మేరకు స్పందించి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని కోరారు. ఈ ఆపత్కాలంలో ప్రజలందరికి అండగా నిలవాలని ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి వైట్ రేషన్ కార్డులకు వెయ్యి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతులకు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారని, నిరుపేద మహిళల జన్ దన్ ఖాతాలకు 500 చొప్పున జమ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కష్టకాలంలో అండగా నిలిచి దేశ ప్రజలకు చేయూత ఇస్తున్నారన్నారు. మన వంతు బాధ్యతగా కరోనా నివారణకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకారం అందించాలని కోరారు.
No comments:
Post a Comment