Followers

కరోనా 4వ విడత ఇంటింటా సర్వే నూరుశాతం నిబద్ధతతో చేపట్టాలి


 


 


 


కరోనా 4వ విడత ఇంటింటా సర్వే నూరుశాతం నిబద్ధతతో చేపట్టాలి -జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన


 


విశాఖపట్నం/ పూర్ణా మార్కెట్ , పెన్ పవర్ ప్రతినిధి సతీష్ కుమార్ 


 


 కరోనా వ్యాప్తి నియంత్రణ చేయు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అనుగుణంగా 4వ విడత ఇంటింటా సర్వే జిల్లాలో నిబద్దతో నూరుశాతం పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోగల మండల పరిషత్ అభివృద్ధి అధికారులతోను, జోనల్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ప్రత్యేకాధికారులతో మాట్లాడారు. జిల్లాలోగల గ్రామీణ ప్రాంతాలోను మున్సిపల్ ప్రాంతాలలోను కరొనా లక్షణాలు వెలికితీయు నిమిత్తం 4వ విడత ఇంటింటా సర్వే నిర్వహించాలని, ఇందులో అందరు వ్యక్తులను ముఖ్యంగా, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, వైద్యులు పాలనా విభాగంలో పనిచేస్తున్న వార్డు / గ్రామీణ కార్యదర్శులు, గ్రామ/వార్డు వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికులను ప్రాధాన్యం ఇచ్చి సర్వే కాలంలో ప్రభుత్వ నియమ సబంధనలకు అనుగుణంగా కరోనా శాంపిల్స్ తీసి సంబంధిత ఆసుపత్రులకు పంపించాలని ఆదేశించారు. 4వ విడతలో జరుగుచున్న సర్వేలో ఎట్టి పరిస్థితులలో ఏ గృహాములు విడవకుండా, గ్రామీణ ప్రాంతంలో ఎం.పి.డి.ఓలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు/ జోనల్ కమిషనర్లు శ్రద్ధవహించాలని కోరారు. గ్రామ ప్రాంతాల్లో జరుగుచున్న సర్వేపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారి దృష్టి సారించాలని, జివిఎంసి పరిధిలో అదనపుకమిషనర్, ముఖ్యవైద్యఆరోగ్యాధికారి, జోనల్ కమిషనర్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కమిషనర్లు వారి ప్రాంతాల్లో బాధ్యతతో సర్వే నిర్వహించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలోని అధికారులకు సాంకేతిక సహాయ సహకారములు కావలసి వచ్చినచో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారిని సంప్రదించవలసినదిగా కోరారు. వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో, పాడేరు సబ్ కలెక్టరు వేంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి నాగార్జునసాగర్, జిల్లా పంచాయతీ అధికారి గోవిందరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు, జివిఎంసి అదనపు కమిషనర్ సోమన్నారాయణ, చీఫ్ మెడికల్ ఆపీసర్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎంపిడిఓలు, జోనల్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, పి. హెచ్.సి వైద్యులు, జివిఎంసి జోనల్/ వార్డు ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...