రంపచోడవరం పెన్ పవర్
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నిషాంత్ కుమార్ ఆద్వర్యంలో రంపచోడవరం జిసిసి వారు అందజేసే నిత్యావసర సరుకులు వారు సమయానికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అందజేస్తున్నారా లేదా అని సోమవారం రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామమునకు వెళ్లి తనిఖీలు నిర్వహించి, ప్రజలు ఎక్కువసమయం నిత్యావసర వస్తువులకోసం ఎదురు చూసే పరిస్థితులు రాకుండా వీలైనంత తొందరగా వారికి అందజేసి పంపించావలేనని జిసిసి డివిజనల్ మేనేజర్ కి ఆదేశాలు జారి చేసారు. అలాగే లోతట్టు ప్రాంతాలలో కూడా ఎవరి ఇబ్బందులు కలగకుండా సమయానికి అందజేయాలని ఆదేశించారు. డి.ఆర్. డిపోలకు వచ్చే ప్రజలు గుంపులుగా కాకుండా ఒక మీటరు దూరం లో నిలబడేలా మార్కింగ్ చెయ్యాలని సరుకులకోసం వచ్చిన వాళ్ళందరూ మాస్కులు దరించేల చూడాలని సూచనలిచ్చారు. అంతే కాకుండా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు వారి ఆదేశముల మేరకు రాజమండ్రి మరియు రంపచోడవరం డివిజనులకు కోవిడ్-19 (కరోన వైరస్) ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వారిని స్పెషల్ అధికారిగా నియమించినందున రెండు డివిజనులలో ఈ వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికి అవగాహన కల్పించటంతో పాటు ఈ వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ప్రజలు వారి ఇళ్లలోనే ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులకు ఆదేశాలు జారిచేశారు. జి.ఎస్.ఎల్. రాజానగరం ఆసుపత్రికి స్పెషల్ అధికారిగా నియమించినందున అక్కడ అన్ని వసతులు అందుబాటులో వున్నయలేదా ఇంకేమేనైన అవసరలున్నాయా అని విజిట్ చేసి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కోవిడ్-19 (కరోన వైరస్) సోకిన రోగులకు అవసరమైన ఏర్పాట్లను చేయడంతో పాటు, ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం జరిగిందని, వారిని చికిత్స నిమిత్తం తీసుకొని వెళ్ళే మార్గమును కూడా చేయడం జరిగిందని తెలియజేసారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలందరూ సహకరిస్తున్నారని ఇలానే అందరు జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ నుండి విముక్తి పొందవచ్చునని తెలిపారు. ఇక్కడ పరిస్థితులను ఏరోజుకారోజు కమిషనరు వారికి అందజేస్తూ ఎక్కడ ఎలాంటి అత్యవసర సేవలు అసరమైన తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment