పెన్‌పవర్ ఆధ్వర్యంలో నిర్విగ్నంగా పంచాయతీ కార్మికులకు సాగుతున్న అన్నదానం
దాత కులువా రామారావు సహకారంతో గురువారం ప్రత్యేక భోజనాలు
(పెన్‌పవర్, పొదిలి)
పెన్‌పవర్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తున్న పంచాయతీ కార్మికులకు, సిబ్బందికి దాతల సహకారంతో నిర్వహిస్తున్న' పెన్ పవర్' అన్నదానం కార్యక్రమం కు గురువారం దాత కులువా వెంకట రామారావు తన స్వంత ఖర్చుతో ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేయించారు. గురువారం కావడంతో భోజనంతో పాటు ఓ స్వీటును కూడా ఆయన స్వయంగా చేయించి పంపారు. పొదిలి కన్జూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఓబుశెట్టి కుసుమ హరప్రసాద్, ఆర్ మల్లారెడ్డిలు స్వయంగా భోజనాలను పర్యవేక్షించారు. ప్రతి నిత్యం మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తున్న భోజనాలు తమకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తున్నాయని దాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి కన్జూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి భూమా సుమంత్, శశిధర్, చేపూరి నాగరాజు, బొమ్మిశెట్టి మస్తాన్ తదితఋలు పాల్గొన్నారు. పెన్‌పవర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న భోజనాల ను చూసిన మరో ఇద్దరు దాతలు కుసుమహరనాధ భక్త సమాజం, పొదిలి వారి తరుపున గునుపూడి మధునూదనరావు, ఓబుశెట్టి వెంకట సుజాత(భవాని) వారు రెండు రోజుల పాటు భోజనాలు అందజేసేందుకు ముందుకు వచ్చారు.
No comments:
Post a Comment