విజయనగరం, పెన్ పవర్
విజయనగరం జిల్లా సుంకర పేట జంక్షన్. ప్రభుత్వ మద్యం షాప్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు రాత్రి 12 గంటల సమయంలో వాటర్ తాగడానికి వెళ్లగానే దొంగలు ప్రవేశించి సుత్తి శానం తో తలుపును పగలగొట్టి పది బాక్స్ లు తీసి ఓపెన్ ప్లేస్ లో అక్కడ అక్కడ పెట్టారు. సెక్యూరిటీ గార్డు రావడంతో దొంగతనంకు పాల్పడిన వారు అక్కడనుంచి వెళ్లిపోయారు. ఈ విషయం గార్డు సూపర్వైజర్ కి తెలియడంతో వెంటనే ఎక్స్చేంజి అధికారులకి ఫోన్ చేయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పది బాక్స్ లు దొరికాయని, ఇంకా మరి ఏమి పోలేదని, దొంగతనం చేసిన వారిపై ఎంక్వైరీ చేస్తామన్న జిల్లా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment